నల్గొండలో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు దక్కవు: జానారెడ్డి

నల్లగొండ జిల్లా: పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్,బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా దక్కదని, కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.సోమవారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని అంగడిపేట,కొండమల్లేపల్లి,దేవరకొండలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ మరియు కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొని మాట్లాడుతూ రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తామని బీజేపీ మోసం చేసిందని,బీజేపీ హయాంలో సమాజంలో అన్ని వర్గాల వారికి మోసం జరిగిందని,ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గాలికొదిలేశారని అన్నారు.

 Brs And Bjp Will Not Get Deposits In Nalgonda Jana Reddy, Brs ,bjp , Nalgonda Di-TeluguStop.com

దేవరకొండ ఎమ్మేల్యే బాలూ నాయక్ మాట్లాడుతూ ఈ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉండదన్నారు.గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గంలోని నక్కలగంటి ప్రాజెక్ట్ 53 కి.మీ.ఉండగా తొమ్మిది కి.మీ.పూర్తి చేస్తే ఈరోజు నియోజకవర్గ ప్రజలను త్రాగునీరు మరియు సాగునీరు అందేదని,ఈ ప్రాంత ప్రజల ఉసురు తగిలి అధికారం కోల్పోయారన్నారు.నల్గొండలో ఓటు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీ వాళ్లకు లేదన్నారు.అనంతరం ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసి, డిండి ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు నీరు అందించే బాధ్యత పూర్తిగా నాదేనని,

అన్ని నియోజకవర్గాలతో పాటు దేవరకొండ నియోజకవర్గం ముందు నడిచే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఎమ్మేల్యే బాలూ నాయక్ తో కలిపి రామలక్ష్మణులా పనిచేసి ప్రాంత అభివృద్ధికి సహకరిస్తానన్నారు.సాగర్ ఎమ్మేల్యే జై వీర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంతో మా కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని, జానారెడ్డికి ఇద్దరు కొడుకులతో పాటు బాలూ నాయక్ కూడా కొడుకు సమానులని,నాగార్జున సాగర్ అభివృదికి ఏ విధంగా సహకరిస్తానో, అదేవిధంగా దేవరకొండ ప్రాంతానికి సహకరించి దేవరకొండ అభివృద్ధికి తోడ్పడతారనని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube