నల్లగొండ కలెక్టర్ గా హరిచందన దాసరి...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో చేపట్టిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా నల్లగొండ జిల్లా కలెక్టర్ గా తెలంగాణ కేడర్ 2010 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి హరిచందన దాసరి ( Hari chandana Dasari )బదిలీ పై వచ్చారు.ఆమె ప్రస్తుతం జిహెచ్ఎంసిలో వెస్ట్ జోన్ జోనల్ కమీషనర్ గా మరియు సీఎస్ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యత)అడిషనల్ కమీషనర్ గా పనిచేస్తున్నారు.

 Hari Chandana Dasari As Nalgonda Collector, Hari Chandana Dasari , Nalgonda Co-TeluguStop.com

ఆమె బాల్యమంతా హైదరాబాద్ ( Hyderabad )లోనే జరిగింది.ఎంఏ పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ లో చేశారు.

తరువాత ఎంఏ ఎకనామిక్స్ లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ లో పూర్తి చేశారు.

ఆమెను క్లైమేట్ చేంజ్ క్రూసేడర్ మరియు రీసైక్లింగ్ యొక్క న్యాయవాది అని పిలుస్తారు,ఇది ఆమెకు అనేక ప్రశంసలను తెచ్చిపెట్టింది.

గ్రీన్ గవర్నెన్స్ లో ఆమె చేసిన కృషికి గాను బెటర్ ఇండియా ఎన్నుకొన్న 10 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ లోను ఆమెకు స్తానం దక్కింది.వ్యర్థ పదార్థాల నిర్వహణ పట్ల ఆమె చేసిన కృషి కూడా ప్రశంసనీయం.

ఆమె భారతదేశపు మొట్టమొదటి వెదురు సమావేశ మందిరాన్ని హైదరాబాద్ లో నిర్మించారు.ఆమె హైదరాబాద్ ఇండియాలోని గచ్చిబౌలిలో భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేకమైన డాగ్ పార్కును నిర్మించారు.

ఆమె తన జిహెచ్ఎంసి కార్యాలయాన్ని సెరిలింగంపల్లిలో మొట్టమొదటి జీరో వేస్ట్ ఆఫీసుగా మార్చి ఐఎస్ఓ 14001 ధృవీకరణ పత్రాన్ని పొందారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube