సాధారణంగా తల్లి( Mother ) తమ పిల్లల కడుపు నిండిందా లేదా అనేది చూసుకుంటుంది.తన ఆకలి గురించి ఎప్పుడూ ఆలోచించదు.
అందుకే ఈ ప్రపంచంలో తల్లికి మించిన దైవం మరొకటి లేదని అంటారు.మనుషుల్లోనే కాదు జంతువుల పక్షుల్లో ఇతర జీవులలో తల్లులు నిస్వార్థమైన ప్రేమను చూపిస్తుంటాయి.
ఇది పిల్లల కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి వాటి సంబందించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.తాజాగా ఓ తల్లి పక్షికి( Mother Bird ) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలామందిని ఆకట్టుకుంటోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పక్షి రెస్టారెంట్‌లోని( Restaurant ) బల్లపై వాలడం చూడవచ్చు.అదే బల్లపై దాని రెండు పక్షి పిల్లలు కూడా వాలి ఉన్నాయి.తల్లి పక్షి ఆ బల్లపై ఒక ప్లేట్ లో ఉన్న ఫుడ్ ను( Food ) పొడవడం చూడవచ్చు.అంతే కాదు ఆ ఫుడ్‌ను కొంచెం ముక్కుతోటి కొరికి వాటిని తన పిల్లల నోటికి అందిస్తోంది.
ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీశారు.ఆ తల్లి తన పిల్లలకు పెట్టకుండా ఆహారం తినడం లేదు.

ముందుగా వాటి కడుపునిండా నింపడానికే ఆ తల్లి ప్రయత్నించింది.ఆ తల్లి ప్రవృత్తిని చూసి చాలామంది ఎమోషనల్ అవుతున్నారు.అది ఏ జీవైనా సరే తల్లి ప్రేమకు మించిన ప్రేమ మరొకటి ఉండదని కామెంట్లు చేస్తున్నారు.@Yoda4ever ట్విట్టర్ పేజీ వీడియోను పంచుకుంది.“తల్లి పిచ్చుక( Mother Sparrow ) రెస్టారెంట్‌లో తన పిల్లలకు ఆహారం ఇస్తోంది” అని ఈ వీడియోకి క్యాప్షన్ జోడించింది.13 సెకన్ల నిడివిగల ఈ క్లిప్‌కు ఇప్పటికే ఎనిమిది లక్షల దాకా వ్యూస్ వచ్చాయి.ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.







