బీరుతో నల్లగొండ బేజార్...!

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటుగా బీర్ల విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.2023 మే 1 నుంచి 21 వరకు రాష్ట్రంలో 4.23 కోట్ల బీర్ సీసాలు అమ్ముడయ్యాయి.కేవలం బీర్ల విక్రయం ద్వారా ఫ్రభుత్వం రూ.582.99 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.మరో రెండు వారాల్లో బీర్ల విక్రయాలు మరింత పెరిగే అవకాశం ఉందని,మే చివరి నాటికి బీర్ల విక్రయం రూ.1000 కోట్లు దాటుతుందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

 Nalgonda District Record In Beer Sales In This Season, Nalgonda District , Beer-TeluguStop.com

ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మే నెల ప్రారంభం నుంచి మే 21 తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 19 డిపోల ద్వారా 35 లక్షల 25వేల 247 కాటన్‌ల బీర్‌ బాటిళ్లు అమ్ముడయ్యాయి.ఈ 21 రోజుల్లో బీర్ల విక్రయాల్లో నల్గొండ జిల్లా అగ్రస్థానంలో ఉండగా,కరీంనగర్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది.నల్గొండ జిల్లాలో రూ.48.14 కోట్ల విలువైన 3 లక్షల 364 కాటన్‌ల బీర్ల విక్రయాలు జరిగడం గమనార్హం.మే నెల ప్రారంభం నుంచి 21 తేదీ వరకు మొత్తం 35,25,247 కాటన్లు బీర్లు అమ్ముడయ్యాయి.

ఒక్కో కాటన్​కు 12 బీర్ల చొప్పున సగటున రోజుకు 23,50,164 బీరు సీసాలు ఖాళీ అయ్యాయి.ఈ లెక్కన 21 రోజుల్లోనే 4,23,02,964 బీరు సీసాలను మద్యం ప్రియులు ఖాళీ చేశారు.

మరో వైపు లిక్కర్ విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది.ఈ జిల్లాలో 1,20,334 కాటన్ల లిక్కర్ సేల్ కాగా.రూ.78.42 కోట్ల ఆదాయం వచ్చింది.నల్గొండ జిల్లా రెండో స్థానంలో ఉంది.ఓవరాల్ గా ఈ 21 రోజుల్లో లిక్కర్ విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.904.47 కోట్ల ఆదాయం వచ్చింది.జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 17 వరకు 1,01,54,100 బీర్‌ బాటిళ్లు అమ్ముడయ్యాయి.

రోజుకు సగటున 6 లక్షల బీర్ బాటిళ్లను మద్యం ప్రియులు లాగేస్తున్నారు.ఈ 17 రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 8,46,175 బీర్ కాటన్‌లు అమ్ముడవడం విశేషం…!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube