నల్లగొండ జిల్లా:అధికార పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా టిక్కెట్ పొంది గ్రామాల్లో తిరుగుతున్న గులాబీ ఎమ్మెల్యేలు వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు.గ్రామాలకు వెళుతున్న వారికి అడుగడునా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైతున్న నేపథ్యంలో సహనం కోల్పోతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తమ అసహనాన్ని ప్రదర్శిస్తూ ప్రజల్లో మరింత చులకన అవుతున్నారు.
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు( MLA Nallamothu Bhaskar Rao ) ఇప్పటికే అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచినా ఆయన తీరు మారలేదు.తాజాగా గత మంగళవారం శెట్టిపాలెం గ్రామంలో పంచాయితీ ఆఫిస్ ప్రారంభించేందుకు వెళ్ళిన ఎమ్మెల్యే మాట్లాడుతుండంగా ఓ గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళ ఎక్కడ మీరు చేసిన అభివృద్ధని నీలదియ్యడంతో సహనం కోల్పోయి దొంగముండా,నన్ను అడిగేదానివా, దానిని ఇక్కడి నుండి పంపించండి అంటూ అసభ్యకరంగా మాట్లాడి అవమానించి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
నల్లమోతు విషయం మరువక ముందే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య( Nakirekal MLA Chirumurthy Lingaiah ) గురువారం కట్టంగూర్ మండలం ఎర్రసానిగూడెం,కట్టంగూర్, కురుమర్తి,పరడ గ్రామాల్లో పలు అభివృద్ధి అంశాలపై మాట్లాడుతుండగా అక్కడ కూడా మూడెకరాల భూమి,దళిత బంధు, వృద్ధాప్య పింఛన్స్,బిటి రొడ్లు,చెరువు,కాల్వల నిర్మాణలపై గ్రామస్థులు నిలదీశారు.తమ గ్రామానికి ఏం చేశావంటూ ప్రశ్నించారు.
దీనితో ఎమ్మెల్యే సహనం కోల్పోయి మాట్లాడడంతో ప్రజలు తిరుగుబాటు చేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది.పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
అదే రోజు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గిరిజన బాలుర గురుకుల పాఠశాలను ప్రారంభానికి వెళ్ళిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మండల వైస్ ఎంపీపీ అయిన గిరిజన ప్రజాప్రతినిధి ఆంగోతు రాజును ఆంగోతుకు బదులుగా ఆంబోతు అని సంబోధించడంతో పక్కనే ఉన్న పలువురు ప్రజాప్రతినిధులు ఆంగోతు అని చెప్పినా పట్టించుకోకుండా వైస్ ఎంపీపీని ఉద్దేశిస్తూ వాడు ఆంబోతు లాగా ఉన్నాడు కాబట్టి ఆంబోతు అనుకున్నానని అంటూ హేళన చేస్తూ మాట్లాడారు.దీంతో సమావేశంలో ఉన్న పలువురు గిరిజనులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
అనంతరం ఎమ్మెల్యే మళ్లీ తేరుకొని సారీ సారీ అని పలుమార్లు అన్నారు.గిరిజన ప్రజాప్రతినిధిని వేదికపై అవమానించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
.