రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి థియేటర్లలో మ్యాడ్ సినిమా( MAD Movie ) విడుదలైంది.ఈ సినిమా కొంతమంది అభిమానులకు ఎంతగానో నచ్చితే మరి కొందరు మాత్రం ఈ సినిమా గురించి అబవ్ యావరేజ్ అని స్పందిస్తున్నారు.
క్రిటిక్స్ నుంచి మాత్రం మ్యాడ్ సినిమాకు పాజిటివ్ గా రివ్యూలు వస్తుండటం గమనార్హం.మ్యాడ్ సినిమాలో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ కూడా మెయిన్ హీరోలలో ఒకరిగా నటించారు.

అయితే నార్నె నితిన్( Narne Nithin ) నటన ఇంప్రెసివ్ గా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ పరువు తీసిన బావమరిది నితిన్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నటన విషయంలో నితిన్ ఎంతో ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది.నితిన్ యాక్టింగ్ పై నెగిటివ్ కామెంట్స్( Negative Comments ) వస్తున్న నేపథ్యంలో నితిన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
నితిన్ కోసం ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ మాత్రం ఒకింత నిరాశ చెందుతున్నారు.
నితిన్ తర్వాత సినిమాల విషయంలో తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.
నార్నె నితిన్ తన యాక్టింగ్ స్కిల్స్ ను మరింత ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రమే టాలీవుడ్ యంగ్ హీరోలలో( Tollywood Young Heroes ) ఒకరిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నార్నె నితిన్ కు కుటుంబం నుంచి ఊహించని స్థాయిలో సపోర్ట్ లభిస్తోంది.

కామెడీ సినిమాల కంటే మాస్ సినిమాలకు నార్నె నితిన్ ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నార్నె నితిన్ తర్వాత ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.నార్నె నితిన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) సపోర్ట్ ఉండటం కెరీర్ పరంగా ఒకింత ప్లస్ అవుతోంది.నార్నె నితిన్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అంతకంతకూ పెరుగుతోంది.