నల్లగొండ జిల్లా:గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క సారక్కలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ గురువారం లంబాడి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎల్.ఎస్.
ఓ) ఆధ్వర్యంలో మిర్యాలగూడ డిఎస్పి వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బి.ప్రసాద్ (సిద్దు నాయక్)మాట్లాడుతూ గిరిజన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన జీయర్ స్వామి వ్యాఖ్యల వీడియోను ఆధారం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.గిరిజనులు ఎన్నో సంవత్సరాల నుండి పూజలు చేస్తూ లక్షలాది మంది భక్తులు మొక్కులు తీర్చుకునే దేవతపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
కేసు నమోదు చేసి రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు.