నల్లగొండ జిల్లా:భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ)జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, స్వాతంత్ర్య సమరయోధులు,జనసేవాదళ్ స్థాపించి విజయవాడ రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వీరుడు,కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత,మహామనిషి, యావత్తు ఆస్తిని పేదలకు పంచిన త్యాగశీలి,ధనిక, పేద తేడాల్లేని సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా జీవితాంతం కృషి చేసిన ఆదర్శమూర్తి,స్పూర్తిప్రదాత కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ పల్లా నర్సింహారెడ్డి అన్నారు.చండ్ర రాజేశ్వరరావు 28వ వర్ధంతి సందర్భంగా దేవరకొండ సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి నూనె రామస్వామి,సీనియర్ నాయకులు యసాని పాండురంగారెడ్డి,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు,పట్టణ కార్యదర్శి జూలూరి వెంకట్రాములు,మండల కార్యవర్గ సభ్యులు ఎండి మైనోద్దీన్,జూలూరి జ్యోతిబసు,ఏశామోని మల్లేష్, జక్క కృష్ణారెడ్డి,మహేశ్వరం బ్రహ్మచారి,పోతురాజు పర్వతాలు,వి.బక్కయ్య,అర్జున్ తదితరులు పాల్గొన్నారు.