అక్కినేని ఫ్యాన్స్ కి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అనీల్ సుంకర క్షమాపణలు చెప్పారు.అఖిల్ బర్త్ డే సందర్భంగా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఏజెంట్ సినిమా నుండి టీజర్ వస్తుందని భావించగా ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరుస్తూ అఖిల్ ఏజెంట్ నుండి ఓ పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారు.
ఈ విషయంపై నిర్మాతని అక్కినేని ఫ్యాన్స్ ఎటాక్ చేశారు.దీనిపై స్పందించిన నిర్మాత అక్కినేని ఫ్యాన్స్ కి సారీ అని చెప్పారు.
బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చే ఉద్దేశంతో సినిమా టీజర్ లేట్ అవుతుందని అన్నారు.
సురేందర్ రెడ్డి డైరక్షన్ లో అఖిల్ ఏజెంట్ సినిమా వస్తుంది.
ఈ సినిమాలో సాక్షి విద్య హీరోయిన్ గా నటిస్తుంది.సైరా నరసింహా రెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అక్కినేని ఫ్యాన్స్ అందరు మెచ్చేలా ఏజెంట్ సినిమా చాలా ప్రత్యేకతలతో తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు నిర్మాత అనీల్ సుంకర.ఈ సినిమాను ఆగష్ట్లో రిలీజ్ ఫిక్స్ చేశారు.
బ్యాచిలర్ తో కెరియర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్న అఖిల్ ఆ హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నాడు.ఏజెంట్ సినిమా ఫుల్ లెంగ్త్ మాస్ మూవీగా వస్తుంది.