విక్టరీ వెంకటెష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్3. సూపర్ హిట్ మూవీ ఎఫ్2కి సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
సినిమాలో ఇప్పటికే సోనాల్ చౌహాన్ స్పెషల్ సాంగ్ లో నటిస్తుందని వార్తలు రాగా లేటెస్ట్ గా ఆమె ప్లేస్ ని పూజా హెగ్దే కొట్టేసిందని టాక్.దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్ చేస్తే సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని భావించి అమ్మడిని ఒప్పించారట.
ఈమధ్య పూజా హెగ్దే చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబడుతున్నాఇ.
అంతేకాదు పూజా హెగ్దే సినిమాలో ఉంటే గ్లామర్ విషయంలో ఢోకా ఉండదు.
అందుకే పూజా హెగ్దేని కావాలని తీసుకుంటున్నారు.ఎఫ్ 3 సినిమాలో పూజా హెగ్దే నిజంగానే స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని చెప్పొచ్చు.
విజయ్ బీస్ట్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పూజా హెగ్దే త్రివిక్రం మహేష్ సినిమాలో కూడా లక్కీ ఛాన్స్ అందుకుంది.ఈ సినిమాల తర్వాత పూజా హెగ్దేని అందుకోవడం కష్టమే అని అంటున్నారు.
అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.