కులవృతులపై రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు:గూడూరు నారాయణరెడ్డి

యాదాద్రి జిల్లా:భువనగిరి పట్టణంలోని రిటైర్ ఉద్యోగుల భవనంలో గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణ నాయిబ్రాహ్మణ సేవ సమితి సౌజన్యంతో పట్టణంలోని పేద నాయిబ్రాహ్మణుల అందరికీ వారి వృత్తికి సంబంధించిన పనిముట్లను లబ్ధిదారులకు గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ అధినేత,బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ గత నెల 26 వ తేదీన తన జన్మదినాన్ని పురస్కరించుకుని భువనగిరి నియోజకవర్గ పరిధిలోని పేద నాయి బ్రాహ్మణ మరియ రజక కులాలకి చెందిన వారికి వారివారి వృత్తికి చెందిన పనిముట్లను గూడూరు నారాయణరెడ్డి ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు.

 State Government Short-sightedness On Castes: Gudur Narayanareddy-TeluguStop.com

మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సబ్ కా సాత్,సబ్ కా వికాస్,సబ్ కా విశ్వాస్ అనే నినాదం తనను ఎంతగానో ఆకర్షించిదని,వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి పేదవారి ముఖంలో చిరునవ్వు చూడాలని,వారు ఆర్థిక పరిపుష్టి సాధించాలని కోరుతున్నట్లు తెలిపారు.అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ కార్డ్ మరియు హెల్త్ కార్డుని ప్రతి ఒక్క లబ్ధిదారుడు వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్ పట్నం కపిల్,బీజేపీ టౌన్ ఉపాధ్యక్షులు ఆకుతోట రామకృష్ణ,ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు తుమ్మల నగేష్,ప్రధాన కార్యదర్శి ఉషాకిరణ్,నాయి బ్రాహ్మణ భువనగిరి పట్టణ అధ్యక్షులు పత్తేపురం మహేందర్,ఉపాధ్యక్షులు రాచమల్ల మురళి,పత్తెపురం సురేష్,ప్రధాన కార్యదర్శి కానుగంటి ప్రేమ్ కుమార్,నాగపూరి నర్సయ్య రాచకొండ కుమారస్వామి,వేముల సత్యనారాయణ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube