నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ తనదైన శైలిలో పట్టుబిగుస్తుంది.సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం,చౌటుప్పల్, నల్లగొండ జిల్లా మునుగోడు,నాంపల్లి మండలాల్లోని పలు గ్రామాల నుండి టీఆర్ఎస్,సీపీఐ పార్టీలకు చెందిన సర్పంచ్ లు,వార్డు సభ్యులు,మండల నాయకులు,కార్యకర్తలు సుమారు 800 మంది బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి,తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
వారికి కాషాయ కండువా కప్పిన ఈటెల సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.బీజేపీలో చేరిన వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం ధర్మోజీగూడెం టీఆర్ఎస్ సర్పంచ్ లావణ్య మల్లేష్ యాదవ్,గుడిమల్కాపూర్,సర్వేల్,మల్లారెడ్డిగూడెం గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, యువత,చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామ సర్పంచ్ బక్క స్వప్న శ్రీనాథ్,దేవులమ్మనాగారం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు,నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం తుంగపాడు గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు,మునుగోడు మండలం కల్వకుంట్ల సర్పంచ్,సిపిఐ నాయకుడు పగిల్ల భిక్షం, కిష్టాపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి ప్రేమ్ కుమార్ ఉన్నారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పూర్తిగా ఖాళీ అయిపొయే పరిస్థితికి వచ్చిందని,రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మే స్థితిలో మునుగోడు ప్రజలు లేరన్నారు.మంత్రి జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులను బీజేపీలో చేరకుండా ఎన్ని కుట్రలు చేసినా వారిని ఆపలేరని,అభ్యర్థిని ప్రకటించలేని పార్టీ పరిస్థితి ఏమిటో ప్రజలకు అర్థమై బీజేపీలో చేరుతున్నారన్నారు.
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా మునుగోడు గడ్డపై బీజేపీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.