హైదరాబాద్ విజయవాడ హైవే 6 లైన్లు చేయండి:కేంద్ర మంత్రితో ఎంపీ కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా:హైదరాబాద్ టు విజయవాడ హైవే 6 లైన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కేంద్ర రోడ్డురవాణా, రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీ ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు.

 Make Hyderabad Vijayawada Highway 6 Lines: Mp Komatireddy With Union Minister-TeluguStop.com

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ భేటీలో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారి 6 లైన్ల నిర్మాణంపై చర్చించామని తెలిపారు.ఈ రహదారిని 2022 ఏప్రిల్ లో ప్రారంభించి 2024 నాటికి పూర్తిచేయాలని కోరినట్లు తెలిపారు.

కానీ,జీఎంఆర్ సంస్థ 2025 లో చేపడతామంటున్నారని,జీఎంఆర్ సంస్థ హైవే నిర్మాణం చేపట్టకుండా ఆర్బిట్రేషన్కు వెళ్లి మెండిగా వ్యవహరిస్తుందని,జీఎంఆర్ నిర్మాణం చేయకపోతే కొత్త సంస్థతో అయినా చేయించాలని కోరినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశంలో జీఎంటీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube