నల్లగొండ ఫ్రూట్స్ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్ లో పేలుడు ధాటికి తెగిపడ్డ శరీరాలు...!

నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డు బర్కత్ పుర కాలనీ వెటర్నరీ హాస్పిటల్ సమీపంలోని న్యూ స్టార్ ఫ్రూట్స్ గౌడన్‌లో బనాన ఏసీ కంప్రెషర్ పేలి ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.మృతులు కోల్డ్ స్టోరేజీ ఓనర్ షేక్ కలీమ్,అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ గా గుర్తించారు.

 Explosion In Nalgonda Fruits Cold Storage Godown, Explosion ,nalgonda Fruits Col-TeluguStop.com

పేలుడు జరిగిన సమయంలో ఉన్న నలుగురు వ్యక్తులు ఆ స్టోరీజి పేలుడు నుంచి తప్పించుకున్నట్లు అక్కడి స్థానికులు తెలిపారు.

పేలుడు ధాటికి మృతుల శరీర అవయవాలు తునా తునకకలై ప్రమాద స్థలం బీభత్సంగా మారింది.

ఈ ఘటనలో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం కూడా వాటిల్లిందని భావిస్తున్నారు.ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఘటనా స్థలానికి నల్లగొండ ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డిఎస్పీ నరసింహారెడ్డి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.జిల్లా ఎస్పీ అపూర్వరావు కూడా ఘటన స్థలాన్ని సందర్శించనున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube