నల్లగొండ జిల్లా:విద్యుత్ శాఖలో( Electricity Department ) పని చేస్తున్న లైన్ మెన్,జేఎల్ఎం,సబ్ స్టేషన్ఆ పరేటర్ నిర్లక్ష్యం కారణంగా ఓ హెల్పర్,విద్యుత్ షాక్ కు గురై హాస్పిటల్ లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సంఘటన నల్లగొండ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…కనగల్ మండలం కోదండపురం గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కు రావడంతో నర్సింగబట్ల గ్రామానికి చెందిన హెల్పర్ కుతాటి అనిల్ కుమార్ ఎల్ సి కోసం జేఎల్ఎం వంగూరి శ్రీనివాస్ కి మరియు లైన్మెన్ నామ మురళికి కాల్ చేసి ట్రాన్స్ఫార్మర్ రిపేరు చేయడానికి ఎల్ సి కావాలని కోరాడు.
ఆ ఇద్దరు అధికారులు సబ్ స్టేషన్ ఆపరేటర్ చందా పాపయ్యకు కాల్ చేసి కోదండపురం లైన్ కిఎల్ సి ఇవ్వాలని చెప్పడంతో ఆపరేటర్ ఎల్ సి ఇచ్చాను రిపేర్ చేసుకోమని చెప్పడంతో హెల్పర్ అనిల్ కుమార్( Anil kumar ) ,ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయడానికీ పైకి ఎక్కడంతో ఒక్కసారిగా షాక్ తగిలి పడిపోయాడు.
దీనితో అతనిని హుటాహుటిన నల్లగొండ హాస్పిటల్ కి తరలించారు.
ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నాడు.ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్,రైతులు కేవలం సబ్ స్టేషన్ ఆపరేటర్,లైన్ మెన్, జేఎల్ఎం నిర్లక్ష్యం కారణంగానే నవీన్ కుమార్ కి ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహంతోసబ్ స్టేషన్ ముందు టెంట్ వేసుకొని ధర్నాకు దిగారు.
ఎల్ సి ఇవ్వమని చెప్పినా సబ్ స్టేషన్ లో ఆపరేటర్ , లైను బంద్ చేయకుండా నిర్లక్ష్యంగా చేశానని చెప్పడం,ఎల్ సి కన్ఫర్మ్ అయిందా లేదా చూడకుండా లైన్ మెన్, జేఎల్ఎం మరింత నిర్లక్ష్యంగా హెల్పర్ ను రిపేర్ చేయమని చెప్పడం విద్యుత్తు అధికారుల తీరుకు అద్దం పడుతుందని గ్రామ సర్పంచ్,స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనకు కారణమైన సబ్ స్టేషన్ ఆపరేటర్,లైన్మెన్, జేఎల్ఎం లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, హెల్పర్ నవీన్ కుమార్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.