మిర్యాలగూడ జర్నలిస్టుల్లో ఇళ్ల స్థలాల పంచాయితీ...!

నల్లగొండ జిల్లా:జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గ జర్నలిస్టులకు గత ప్రభుత్వ హాయంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఆనాటి ఎమ్మెల్యే, అధికారుల సూచన మేరకు ఇందిరమ్మ కాలనీ సమీపంలోని ప్రభుత్వ భూమిని కేటాయించారు.రాళ్లు,రప్పలతో వున్న ఆ భూమిని విలేకరుల వద్ద వసూలు చేసిన సుమారు రూ.5 లక్షలతో సదును చేశారు.అందులో సుమారు వందమందికి ఇంటి స్థలాలు కేటాయిస్తామని ప్రజా ప్రతినిధులు,అధికారులు హామీ ఇచ్చి,త్వరత పలు కారణాలతో మొండి చేయి చూపారు.

 Miryalaguda Journalists House Panchayat , Varakala Suresh, Rayanchu Narasimha, B-TeluguStop.com

నాటి నుండి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్న విలేకరులు,తాజాగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ వినతిపత్రం అందజేశారు.సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఇళ్ల స్థలాల విషయంలో జర్నలిస్టులు వర్గాలుగా విడిపోయారని గుర్తించి,గత శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అందరూ కూర్చొని సమిష్టిగా లిస్టు ఇవ్వాలని సూచించి,ఇళ్ల స్థలాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించగా అధికారులు కూడా సరే అన్నారు.

ఇదే అదునుగా రంగంలోకి దిగిన కొందరు సీనియర్ విలేకరులమని చెప్పుకునే వారు తమ పంతం నెగ్గించుకోవాలని ఎమ్మెల్యే ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా,సొంతంగా కమిటీ ఏర్పాటు చేసుకొని,తమకు నచ్చిన,వారు మెచ్చిన వారిని, ఏనాడు ప్రెస్ మీట్ లో కూడా కనిపించని,వార్తా సేకరణ చేయని,గతంలో ఇళ్ల స్థలాలు పొందిన వారి కుటుంబ సభ్యుల పేరుతో,కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వారిని కూడా ఇళ్ల స్థలాలకు లబ్ధిదారులుగా చేర్చి అనర్హులైన 40 మందితో జాబితా తయారు చేసి, రహస్యంగా అధికారులకు లిస్టు అందజేశారని,పైగా దానికి అందరి ఆమోదం ఉందని ఎమ్మెల్యేను, అధికారులను ఏమార్చి ప్లాట్లు దక్కించుకునేందుకు పథకం వేశారని అర్హులైన జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎవరు అర్హులనేది నిర్ణయించేది అధికారుల అయినప్పటికీ వీరే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులను దగా చేస్తున్నారని వాపోతున్నారు.

దీనిపై సోమవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి,జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి,ఆర్డీవో జి.శ్రీనివాసరావు,తహశీల్దార్ హరిబాబులకు వినతిపత్రాలు ఇచ్చి తమకు అన్యాయం జరుగుతుందని,ఇదేమి న్యాయమని పెద్దలుగా చెప్పుకునే సీనియర్ విలేకరులను ప్రశ్నించగా అంతా తమ ఇష్టమంటూ,మీ దిక్కున్న చోట చెప్పుకోమంటూ మాట్లాడుతున్నారని,అర్హులైన తమకు న్యాయం చేయాలని తమ గోడు వెల్లబోసుకున్నారు.ఎమ్మెల్యే,జిల్లా అధికారులు అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులు ఎవరో,అనర్హులు ఎవరో గుర్తించి అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో దగాపడ్డ జర్నలిస్టులు జంగా లక్ష్మణ్ యాదవ్,పైలం వెంకన్న, నడ్డి శివకృష్ణ యాదవ్, బంటు సైదులు,అలుగుబెల్లి వెంకట్, చెన్నూరి రవికుమార్,వరకాల సురేష్,రాయంచు నరసింహ, బంటు శ్రీనివాస్,నల్లగంతుల నాగభూషణం,రాంప్రసాద్, ధీరావత్ శ్రీను నాయక్,దైద రవి,లక్ష్మణ్,రవి,నగేష్,సైదులు,కృష్ణ,హజార్ సింగ్,శ్రీనయ్య, భరత్ కుమార్,సైదులు, కడమంచి నరసింహ,వి.

నగేష్, పి.శీను,జె.రాజశేఖర్,షేక్ యాసిన్ ఫరీద్,జి.సైదులు, డి.రవి,ప్రశాంత్ యాదవ్,జానీ బాబా,కొత్తపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube