నల్లగొండ జిల్లా: గుర్రంపోడు మండలం నడికుడ గ్రామంలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైయ్యాయి.ఆదివారం యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి టంగుటూరు సురేష్ ప్రారంభించి మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని, యువత క్రీడాస్పూర్తిని పెంపొందించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో క్రీడల నిర్వాహకులు కట్టెబోయిన శేఖర్,ఉపేందర్,మైముద్,కిరణ్,గ్రామ యువకులు సల్ల నరేష్,దాసరి నరేష్,పోలే ముత్తయ్య,గోవింద్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.