నల్లగొండ జిల్లా:బీసీలకు రూ.లక్ష సబ్సిడీ లోన్ ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం బీసీలపై కపట ప్రేమ నటిస్తుందని,కేసీఆర్( KCR ) కి బీసీలు ఏమైనా బిచ్చగాళ్ళుగా కనిపిస్తున్నారా అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్లు బీసీలను పట్టించుకోని ప్రభుత్వం,ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీసీల లక్ష రూపాయల సబ్సిడీ లోన్ ఇస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందనన్నారు.5.70 లక్షల మంది యువత లోళ్ళ కోసం అప్లై చేసుకున్నారని, కార్పొరేషన్ ద్వారా వారికి లోన్లు ఇచ్చే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.బీసీల ఓటు బ్యాంకు కోసమే కేసీఆర్ లక్ష రూపాయల సబ్సిడీ రుణమని ఆరోపించారు.
నిజంగా చిత్తశుద్ది ఉంటే కార్పొరేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న యువతకు వెంటనే లోన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంజి యాదవ్,గంట రాంబాబు పాల్గొన్నారు
.