నల్లగొండ జిల్లా:గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిడమానూరు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని,నన్ను గెలిపిస్తే రెవిన్యూ డివిజన్ గా మార్చి అభివృద్ది చేస్తానని నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు జైవీర్ రెడ్డి ప్రజలకు వాగ్దానం చేశారు.ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడమానూరులో ఆయన రోడ్ షో నిర్వహించి మాట్లాడుతూ చింతగూడెం-నిడమనూరు రహదారిని పూర్తిచేస్తానని, వర్షాలు వచ్చి కట్ట తెగినప్పుడు నిడమనూరుకు ఎలాంటి హాని కాకుండా హైస్కూల్ నుండి బెస్త కాలనీ వరకు వాల్ నిర్మిస్తానని, బీఆర్ఎస్ ఎమ్మేల్యే నోముల భగత్ పాలనలోకుంటుపడిన అభివృద్ధిని పూర్తి చేస్తానని లోకల్ మ్యానిఫెస్టోను ప్రకటించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల సహాయంతో ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు.నిడమనూరు మండలంలో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న లింకు రోడ్లను బాగు చేస్తానని,నల్లగొండ నుండి నిడమనూరుకు బస్సుసౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి రామేశ్వరి,మట్టారెడ్డి, పొన్నంచెడ వీరయ్య,బొల్లం శీను,విశ్వనాధుల రమేష్, ఎంకతి సత్యం,మేరెడ్డి వెంకటరాహుల్ తదితరులు పాల్గొన్నారు.




Latest Nalgonda News