నల్లగొండ జిల్లా:దేశంలో రైతుల చేతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపిన ఓకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM kcr ) అని,యాదాద్రి భువనగిరి జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు న్యాయం అడిగితే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో పెట్టిన సీఎం కేసీఆర్ సర్కార్ రైతు వ్యతిరేక సర్కార్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ధ్వజమెత్తారు.
నల్గొండ జైలులో ఉన్న బాధిత రైతులను సోమవారం ఆయన పరామర్శించి కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు.
అనంతరం వి.
హెచ్( V.Hanumantha Rao ) మాట్లాడుతూ కేసీఆర్ గతంలో ఖమ్మం( Khammam ) రైతులకు బేడీలు వేసి,జైల్లో పెట్టాడని,ఇప్పుడు భువనగిరిలో అదే పని చేశాడని,కిసాన్ సర్కార్ అని చెప్పుకుంటూ కసాయిగా వ్యవహరిస్తూ రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నాడని మండిపడ్డారు.రైతులు ఏమైనా ఆయుధాలు పట్టుకొని నిరసనకు దిగారా ఎందుకు వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని నిలదీశారు.రైతుల ఉద్యమాన్ని ఉదృతం కాకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రైతులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.
ఒకవైపురైతులకు సంకెళ్లు వేసి జైల్లో పెడుతూ ఇంకోవైపు రాష్ట్రావతరణలో రైతు దినోత్సవ పేరుతో ప్రభుత్వం మోసపూరిత వేషాలు వేస్తుందన్నారు.రాష్ట్రంలో రైతు రాజ్యం కాదు గుండా రాజ్యం నడుస్తుందన్నారు.
కేసీఅర్ వచ్చే ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలుస్తామని అనుకుంటున్నాడని,ఆ రోజులు పోయాయన్నారు.కేసీఆర్ ఎన్నికల హామీలు అమలు చేయలేదని, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లుజాడ లేవని,ఇచ్చిన అరకొర ఇండ్ల పంపిణీలో అనర్హులే ఉన్నారన్నారు.
దళిత బంధులో అవినీతి జరిగిందని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పారన్నారు.అసలు అవినీతి జరగని పథకం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు.
రైతుల భూమి రైతులకు ఇచ్చేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని,రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే ఈ సమస్యపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాట ఉదృతం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నల్గొండ డిసిసి అధ్యక్షుడు కె.శంకర్ నాయక్,పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు
.