తెలంగాణ అసెంబ్లీ సాధారణ ఎన్నికల వేళ ఒక పార్టీ నుండి మరో పార్టీలో వలసపోవడం, అప్పటి వరకు ఉన్న పార్టీకి షాక్ ఇవ్వడం,మళ్ళీ అధికారంలో ఏ పార్టీ వస్టే తిరిగి ఆ పార్టీలోకి దూరి పోవడం సర్వసాధారణం.కానీ, కొంతమంది జంపింగ్ జపాంగ్ ల తీరుతో సామాన్య ప్రజలు కూడా షాక్ అవుతున్నారు.
అచ్చం అలాంటి సంఘటనే సోమవారం సూర్యాపేట జిల్లా సూర్యాపేట రూరల్ మండలం రామన్నగూడెం లో చోటుచేసుకుంది.ఆ గ్రామ సర్పంచ్ కత్తుల మల్లయ్య ఉదయం బీఎస్పీ అభ్యర్ధి వట్టే జానయ్య సమక్షంలో బీఎస్పీలో చేరి,బహుజన వాదం కోసం వట్టేను గెలిపించాలని గట్టిగానే చెప్పారు.
ఇంతలోనే ఏం జరిగిందో ఏమో కానీ, మధ్యాహ్నం వరకే ప్లేట్ ఫిరాయించి ఛీ ఛీ నేను బీఎస్పీలో చేరలేదు.కేవలం లిఫ్ట్ అడిగిన పాపానికి నన్ను తీసుకెళ్లి బలవంతంగా కండువా మెడలో వేశారు.
కట్టేసి ఫోటో తీశారు అన్న లెవల్లో స్టేట్ మెంట్ ఇచ్చేసి,తిరిగి రాజ్యసభ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని గ్రామ ప్రజలకు షాక్ ఇచ్చారు.దీనితో ఎన్నికల వేళ నాయకుల చిత్రవిచిత్ర సన్నివేశాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
విలువలు లేకుండా రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు గుర్తుంచుకొని సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్పాలని మాట్లాడుకుంటున్నారు.