నల్లగొండ జిల్లా:తిరుమలగిరి(సాగర్)మండల( Tirumalagiri ) కేంద్రంలోని బీసీ కాలనీలో విద్యుత్ తీగలకి( Electric Wires ) చెట్లు అలుముకున్నాయి.దీని వల్ల కరెంటు తీగల నుండి చెట్టుకు విద్యుత్ సరఫరా సులభంగా పాకుతుంది.
ఈ తీగలు బీసీ కాలనీ నుండి గ్రామంలోని మంచినీళ్లు బావి వరకు రోడ్డు పక్కన వ్యాపించి ఉన్నాయి.
ఈ తీగల వలన ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
విద్యుత్ వైర్ల బారిన మూగజీవాలు పడితే అవి మరణించే అవకాశం ఉంది.ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోక ముందే సంబంధిత అధికారులు శ్రద్ధ వహించి విద్యుత్ వైర్లు సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు
.