ఏం పీక్కుంటారో పీక్కోండి:కేసీఆర్ సవాల్

నల్లగొండ జిల్లా:కేంద్ర ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రతి వేదికపై కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు.మునుగోడులో టీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాదీవెన సభలో ప్రధాని మోదీ,కేంద్రమంత్రి అమిత్‌షాను కేసీఆర్ టార్గెట్ చేశారు.

 Eat What You Eat: Kcr's Challenge-TeluguStop.com

ఈడీ,బోడి కేసులకు భయపడమని,ఏం పీక్కుంటారో పిక్కోండి అంటూ మోడీ,అమిత్ షా లకు సవాల్ విసిరారు.అదేవిధంగా కృష్ణానది జలాలను ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయమంటే మోదీ చేయలేదని తప్పుబట్టారు.

తమ ప్రశ్నలకు అమిత్‌షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రధాని మోదీ పాలనలో ఏ వర్గానికి మేలు జరిగింది? బ్యాంకులు,రైళ్లు,రోడ్లు అన్నింటినీ కేంద్రం అమ్మేస్తోంది ఇక రైతుల భూములను కూడా కేంద్రం అమ్మేస్తుందేమో? ఢిల్లీలో మా నీళ్ల సంగతేంటని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎందుకు అడగరు.బావికాడ మీటర్‌ పెట్టు కేసీఆర్‌ అంటున్నారు.చచ్చినా పెట్టా అని కేంద్రానికే చెప్పా.ఎరువుల ధరలు పెంచాలి,కరెంట్‌ రేటు పెంచాలి,మోదీ పాలనలో పండిన పంటలకు ధర రాదు.మోదీ దోస్తులు సూట్‌ కేసులు పట్టుకొని రెడీగా ఉన్నారు.

కార్పొరేట్‌ వ్యవసాయం చేద్దామనే కుట్ర జరుగుతోందని తెలిపారు.కొట్లాడటం తెలంగాణ ప్రజలకు కొత్త కాదని,కొట్లాడటం మొదలుపెడితే ఎక్కడిదాకా అయినా వెళ్తామని హెచ్చరించారు.

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎందుకు తేల్చరు? అని కేసీఆర్‌ ప్రశ్నించారు.మునుగోడు ఫ్లోరైడ్‌ సమస్యతో ఎలా గోసతీసిందో అందరికీ తెలుసన్నారు.

ఫ్లోరైడ్‌ సమస్యతో ఎలా బాధపడిందో మనం చూశామని,జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యను ఎవరూ పరిష్కరించలేదని చెప్పారు.ఉద్యమం సమయంలో తాను అనేకసార్లు సమస్యను ప్రస్తావించానని,నల్లగొండ నగరా పేరుతో 15 రోజుల పాటు జిల్లా మొత్తం తిరిగానని తెలిపారు.

శివన్నగూడెం గ్రామంలో నిద్ర కూడా చేశానని కేసీఆర్ గుర్తుచేశారు.మిషన్‌ భగీరథ పేరుతో ఫ్లోరైడ్‌ లేని నీళ్లు అందిస్తున్నామని తెలిపారు.

జిల్లాను నో మ్యాన్‌ జోన్‌గా మారే ప్రమాదం ఉందని నిపుణులు కూడా హెచ్చరించారని,ఫ్లోరైడ్‌ బాధితుడిని ఢిల్లీకి తీసుకెళ్లి చూపించినా ఎవరూ వినలేదని పేర్కోన్నారు.మునుగోడులో గోల్‌మాల్‌ ఉపఎన్నిక వచ్చిందన్నారు.

ఎవరి కోసం ఈ ఉపఎన్నికల వచ్చింది?ఇక్కడ ఉపఎన్నికల రావాల్సిన అవసరం ఏముంది? అని సీఎం ప్రశ్నించారు.మరో ఏడాదిలో ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఉపఎన్నిక ఎందుకని నిలదీశారు.

కలిసి ఉండాలని కామ్రేడ్లకు చెప్పాను.అందుకే మాకు మద్దతు ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఐకి ధన్యవాదాలు.సీపీఐ ప్రస్తావించిన సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

ఈ ఐక్యత మునుగోడు నుంచి ఢిల్లీ వరకు ఇలాగే కొనసాగాలి.దేశంలో ప్రగతిశీల శక్తులన్నీ ఏకం చేసి ముందుకు సాగాలి.

భవిష్యత్‌లో సీపీఐ,సీపీఎం,టీఆర్‌ఎస్‌ కలిసి పనిచేస్తాయని కేసీఆర్‌ ప్రకటించారు.కానీ,మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని సభలో ప్రకటిస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.

అభ్యర్థిని ప్రకటించకుండానే కేసీఆర్ సభ ముగించి వెళ్ళిపొయారు.దీనితో మళ్ళీ అభ్యర్థి ఎంపికపై సస్పెన్షన్ కొనసాగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube