మానవ శరీరంలో మర్మాంగాలు అతి సున్నితమైనవి, చాలా ముఖ్యమైనవి.ఆక్సిజన్ ఎక్కువగా చర్మానికి అందదు కాబాట్టి ఇలాంటి భాగాల దగ్గర ఎంత చిన్న సమస్య వచ్చినా, అంత త్వరగా మానదు.
కురుపులు, పుండ్లు ఒక ఎత్తైతే కొందరికి అలాంటి చోట పులిపిర్లు వస్తాయి.వీటినే జేనిటల్ వార్ట్స్ అని అంటారు.
ఇవి ఎలా వస్తాయి అంటే ఇన్ఫెక్షన్ వలన.నిజానికి ఓ టైప్ వైరస్ వలన.దీన్ని హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) అని అంటారు.హైజీన్ పాటించకపోవడం వలన.అంటే మర్మాంగాల శుభ్రత లేకపోవడం వలన.ఒక్కరి కన్నా ఎక్కువమందితో శృంగారం చేయడం వలన, లేదంటే అప్పటికే ఈ ఇన్ఫెక్షన్ ఉన్న పార్టనర్ తో శృంగారం చేయడం వలన.అందరి ఒంట్లో సమానమైన రోగనిరోధక శక్తి ఉండదు.ఇమ్యునిటి పవర్ తక్కువ ఉన్నట్లు అయితే ఈ వార్ట్స్ మరింత ఇబ్బంది పెడతాయి.
నొప్పిగా ఉంటాయి, దురద పెడుతుంది, మంట పెడుతుంది.ఒక్కమాటలో చెప్పాలంటే నరకం చూపిస్తాయి.
ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఎలాగో డాక్టర్ ని కలవాలి.కాని ఇంట్లో మనవంతు వైద్యం కూడా అందాలి కదా.అందుకే ఈ చిట్కాలు.
* ఉల్లిగడ్డను సన్నగా తరిమి, ఓ నాలుగైదు ముక్కలు తీసుకొని వాటిపై ఉప్పు చల్లండి.
ఈ పని రాత్రి చేసి, రాత్రంతా అలానే వదిలేయండి.పొద్దున్నే లేవగానే స్నానానికి ఓ రెండు గంటల ముందు అప్ప్లై చేసుకోండి.
ఇవి వార్ట్స్ ని తగ్గించడమే కాదు, అవి పెరగకుండా అడ్డుకుంటుంది.
* రాత్రి పడుకోవడానికి ముందు స్నానం చేసి, కలబంద గుజ్జు తీసుకోండి.
శుభ్రమైన కాటన్ బాల్ తో ఆలోవెరాను వార్ట్స్ ఉన్న ప్రదేశాల్లో అప్ప్లై చేసుకోండి.రాత్రి అలానే పడుకొని తెల్లారి మళ్ళీ స్నానం చేయండి.
దీని వలన దురద తగ్గుతుంది.
* ఇది కొద్దిగా ఇబ్బందికరమైన ప్రాసెస్ కాని తప్పదు.
ఆపిల్ సైడర్ వెనిగర్ తెలుసుగా.ఓ శుభ్రమైన కాటన్ ప్యాడ్ పై పోసి, ఆ ప్యాడ్ అలానే వార్ట్స్ ఉన్న ఏరియాలో పెట్టేసుకోండి.
మంటగా ఉంటుంది, భరించండి.మీరు ఎంత ఓర్చుకుంటే అంత మంచిది.
ఇలా రోజుకి ఓ మూడు సార్లు చేయండి.ప్రతీసారి ప్యాడ్ ని కనీసం ఓ గంట ఉంచుకోండి.
* టీ ట్రీ ఆయిల్ మార్కెట్లో దొరుకుతుంది.దానికి ఆల్మండ్ ఆయిల్ కలిపి కాటన్ బాల్ తో ఆ ప్రదేశాల్లో రాయండి.
ఇది ఇర్రిటేషన్ ని మాత్రమే, వార్ట్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
* అల్లం పేస్టూ కూడా పనిచేస్తుంది.
ఇది వైరస్ పెరగకుండా ఆపుతుంది.కొంచెం మంటగా ఉన్నా ఓర్పు కావాలి.