హలో మాదిగ ఛలో ఢిల్లీ కరపత్రం విడుదల...!

నల్లగొండ జిల్లా:తరతరాల నుండి మాదిగ హక్కులను హరిస్తూ రావల్సిన ఉద్యోగాలు,ఉపాధి అందకుండా చేస్తున్నందుకు నిరసనగా ఆగస్టు 9న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న మాదిగ( medi-papanna-madiga ) ఆధ్వర్యంలో జరగబోయే మహాధర్నకు మాదిగలంతా తరలి వచ్చి విజయవంతం చేయాలని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కంబాలపల్లి వెంకటయ్య పిలుపునిచ్చారు.గురువారం నల్లగొండ జిల్లా( Nalgonda District ) దేవరకొండ పట్టణంలో నియోజకవర్గ ఇంచార్జ్ సహదేవుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మహాధర్నా కరపత్రం విడుదల చేశారు.

 Hello Madiga Chalo Delhi Pamphlet Released…!-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే వందరోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేసి, ఏబిసిడిలుగా విభజిస్తామని బూటకపు మాటలు చెప్పి,మాదిగ దండోరా సభలకు బీజేపీ అగ్రనాయకత్వం వచ్చి ఎస్సీలలో 59 కులాలకు రిజర్వేషన్లు సమాన పంపిన జరపాలని,పార్టీ కట్టుబడి ఉందని కల్లబొల్లి మాటలు చెప్పి మాదిగ, ఉపకులాల ఓట్లు దండుకొని అధికారం చేపట్టిన బీజేపీ,ఇప్పటి వరకు వర్గీకరణ చేయకపోవడం సిగ్గుచేటన్నారు.అందుకు నిరసనగా ఢిల్లీలో మహా ధర్నా ఏర్పాటు చేస్తున్నామని బీజేపీ దశాబ్దకాలం పాలించి మాదిగ,మాదిగ ఉపకులాల ఓట్ల మీద ఉన్న ప్రేమ ఎస్సీ వర్గీకరణపై చూపలేదన్నారు.

రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారి మోడీ వర్గీకరణ చేస్తామని ఊరిస్తూ ఇప్పటివరకు చేసిందేమీ లేదని,అందుకు నిరసనగా జరిగే ఉద్యమమే మహాధర్నా అని తెలిపారు.ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కన్వీనర్లు ఎర్ర యాదగిరి,మండల అధ్యక్షుడు సాయి సంజీవ, యేసు,సీనియర్ నాయకులు కాశయ్య,ఎర్ర ఆంజనేయులు,కాశయ్య, సుమన్,సుధాకర్,ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ,సైదులు,నగేష్, వంశీ,సహదేవుడు,నగేష్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు అడేపూ సతీష్, శివ,కొండల్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube