నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో గుట్కా దందా జోరుగా సాగుతుంది.గుట్కా వ్యాపారులు తెలివిగా బైక్ పై గుట్కా తరలిస్తూ పట్టణంలోని కిరాణా,పాన్ షాపులకు హోల్ సేల్ గా బహిరంగ విక్రయాలు చేస్తున్నారు.
ఒకవైపు ప్రభుత్వం గుట్కాలపై నిషేధం విధించినప్పటికీ అసలు నిషేధం అమలో ఉందా లేదా తెలియని పరిస్థితిలో గుట్కా, తంబాకు లాంటి ప్రమాదకర పదార్థాల విక్రయాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినా,గత కొంతకాలంగా నకిరేకల్ పట్టణంలో గుట్కా వ్యాపారంపై సంబధిత అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
నల్లగొండ,సూర్యాపేట నుండి నకిరేకల్ పట్టణానికి నిత్యం పదుల సంఖ్యలో చిరు వ్యాపారుల ఎవరికి అనుమానం రాకుండా బైక్ లపై చిన్నపాటి లగేజీ బ్యాగులు,
కిరాణం బ్యాగుల్లో తరలిస్తూ పాన్ షాపులు,హోటల్ వద్ద విక్రయిస్తున్నారు.జిల్లా స్థాయిలో మాఫియా అవతారం ఎత్తి చిరు వ్యాపారుల సహకారంతో వ్యాపారాన్ని గుట్టుగా సాగిస్తున్నారు.
అక్రమార్కుల ఆగడాలను అరికట్టాల్సిన అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని,దీనితో అడిగే వారు లేక గుట్కా మాఫీయా ఇష్టారాజ్యంగా దందా చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని స్థానికులు అంటున్నారు.గుట్కా విక్రయాలతో యువత ఆరోగ్యాన్ని తీవ్రంగా నష్టపోతున్నా పాలకులు కేవలం ప్రచార ఆర్భాటాలే తప్ప ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారని వాపోతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గుట్కా మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.