ఋణమాఫీ వచ్చినా తప్పని తిప్పలు...!

నల్లగొండ జిల్లా:ప్రభుత్వ నుండి రుణమాఫీ(Loan Waiver ) పొందిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమై రెండు మాసాలైనా కొత్తగా రుణాల కోసం బ్యాంకులకు వెళ్ళే రైతులకు బ్యాంకర్లు ఆంక్షలు విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు.పంట రుణాల వడ్డీ చెల్లించే సమయంలో కేంద్ర ప్రభుత్వం( Central Govt ) ఇచ్చే వడ్డీ రాయితీని మినహాయించుకుని మిగతా వడ్డీ డబ్బులు తీసుకోకుండా మొత్తం వసూలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు.

 Even If The Loan Is Waived, They Will Turn The Wrong Way ,loan Waiver , Farmer-TeluguStop.com

వాణిజ్య బ్యాంకుల్లోనైతే కేంద్ర రాయితీని మినహాయించుకుని మిగతా సొమ్ము తీసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.సహకార బ్యాంకుల్లో మాత్రం రుణమాఫీ పొందిన రైతులు తిరిగి పంట రుణాలు పొందేందుకు ఆంక్షలు విధించడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.

సహకార సంఘాల్లో పంట రుణాలపై ఆంక్షలుఉమ్మడి నల్లగొండ( Nalgonda )లో నల్లగొండ,సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో 30 బ్రాంచ్‌ల పరిధిలో 107 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో తీసుకునే పంట రుణాలపై ఆంక్షలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు.ప్రతిసారి పంట రుణం పొందాలంటే సహకార సంఘం చైర్మన్‌,ముగ్గురు డైరెక్టర్ల సంతకాలు, ఒకరిద్దరి రైతుల జామీన్‌ ఉండి ఒరిజినల్ పట్టాదారు పాసుపుస్తకం ఇస్తేనే రుణాలు ఇస్తున్నారన్నారు.

లక్షకు పైగా రుణం తీసుకుంటే మాత్రం తప్పనిసరిగా భూమిని మార్ట్‌గేజ్‌ చేయాల్సిందేనని చెబుతుండడంతో రైతులు ఆందోళనలో పడ్డారు.వాణిజ్య బ్యాంకుల్లో రుణాలు తీసుకునేటప్పుడు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌( Aadhaar card),ఆన్ లైన్ పహని,1బి ప్రతులు తీసుకుని రుణాలు ఇస్తున్నారని తెలిపారు.

రూ.లక్షకు మించితే మాత్రం ఒరిజినల్‌ పట్టాదారు పాసుపుస్తకాన్ని బ్యాంకులో పెట్టుకుని రుణాలు ఇస్తున్నారని చెబుతున్నారు.

కానీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మాత్రం నిబంధనలను కఠినతరం చేశాయని రైతులు పేర్కొంటున్నారు.మరికొన్ని సంఘాల్లో చైర్మన్‌,డైరెక్టర్ల సంతకాలు సంఘాల సిబ్బంది పెట్టించి దానికి ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేసి రుణాలు ఇస్తున్నాయని, రూ.లక్ష మించి రుణాలు పొందే రైతుల భూములను మాత్రం మార్ట్‌గేజ్‌ (సెల్ఫ్‌ డిక్లరేషన్‌) చేయకుండా రుణాలు ఇవ్వడం లేదని రైతులు పేర్కొన్నారు.ఒరిజినల్‌ పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకోకుండా,సంతకాల కోసం చైర్మన్‌,డైరెక్టర్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా గతంలో ఇచ్చిన విధంగానే రుణాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube