నల్లగొండ జిల్లా: మునుగోడు మాజీ ఎమ్మెల్యే,బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శనివారం ఆయన స్పందించారు.తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని, ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నానని,తన అభిప్రాయాన్ని అధిష్టానానికి చెబుతానని చెప్పారు.
కేంద్రం ప్రభుత్వం కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని,తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని అన్నారు.బీజేపీ,బీఆర్ఎస్ మధ్య అండర్ స్టాండింగ్ ఉందని ప్రజలు భావిస్తున్నారని,వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం ఇస్తుందని, అందులో భాగంగానే కేటీఆర్ కు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ ఇచ్చారని తెలిపారు.కేటీఆర్ కు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదన్నారు.
నేను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు మీడియా ఎక్కువ చేసి చూపిస్తుందని,మోదీ, అమిషా తలుచుకుంటే ఇప్పటికీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రజల ఆలోచనలో మార్పు వచ్చినట్టు కనబడుతుందన్నారు.