నల్లగొండ జిల్లా: పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంత ప్రాధాన్యమో,భూగర్భ జలాలు అడుగంటి పోకుండా ఉండేందుకు ప్రతీ ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఎమ్మేల్యే బత్తుల లక్ష్మారెడ్డి( MLA Bathula Laxma Reddy ) అన్నారు.
గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 4వ రోజు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం ( Miryalaguda)చింతపల్లి గ్రామంలోపాల్గొని గ్రామ అధికారులు,సిబ్బందితో కలిసి గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటి,ఇంకుడు గుంతలు తీశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ ఇంట్లో మొక్కలు నాటడంతో పాటు ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం తమ బాధ్యతగా భావించాలని, అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా విషరోగాల వ్యాప్తి చెందకుండా నివారించవచ్చన్నారు.
ప్రజలకు స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమంపై పూర్తి అవగాహన కల్పించే బాధ్యత మీరు కూడా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.