విద్యుత్ షాక్ గురై రైతు మృతి

నల్లగొండ జిల్లా:పెద్దవూర మండలం గర్నెకుంట శివారులో సోమవారం సాయంత్రం విద్యుత్ షాకుకు గురై చిట్టిమల్లె శ్రీను(40)( Chittimalle Srinu (40) )అనే రైతు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

 Farmer Dies Due To Electric Shock ,farmer, Electric Shock, Died ,nalgonda Distr-TeluguStop.com

వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలో పనిచేస్తుండగా బోరు పోయకపోవడంతో కొద్ది దూరంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఫీజు పోయిందని గ్రహించి ఫీజు వేద్దామని ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి పైకి ఎక్కగా ట్రాన్స్ఫార్మర్ సరిగా ఆప్ కాకపోవడంతో విద్యుత్ షాకుతో క్రింద పడిపోయాడు.

భార్య జయమ్మ గ్రహించి చికిత్స నిమిత్తం ఆటోలో పెద్దవూర తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు.

భార్య జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ఆనంద్ యోగి తెలిపారు.మృతుడికి ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube