అధ్వాన్నంగా రోడ్లు-అవస్థలు పడుతున్న ప్రజలు...!

నల్లగొండ జిల్లా:జిల్లాలో 65వ జాతీయ రహదారిపై ఉన్న పట్టణం,రాజకీయ చైతన్యానికి పురిటిగడ్డ,రెండేళ్ల క్రితం మున్సిపాలిటీగా ఏర్పడిన నియోజకవర్గ కేంద్రం,ఇదంతా నకిరేకల్ పట్టణానికి ఉన్న గత వైభవం.

కానీ,ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ప్రజా పోరాట సమితి పిఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు నూనె వెంకటస్వామి అన్నారు.

మున్సిపాలిటీగా ఆవిర్భవించి రెండేళ్లు గడుస్తున్నా పట్టణంలోని అంతర్గత రోడ్లు మొత్తం అధ్వాన్నంగా తయారై,అస్తవ్యస్తంగా ఉన్నాయని నిరసన తెలుపుతూ సోమవారం నకిరేకల్ పట్టణంలో పాడుబడ్డ రోడ్లపై పీఆర్పీఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంగా,ఐదు మండలాల ప్రజలకు ఆయువుపట్టుగా,సుమారు వంద గ్రామాల పరిసర ప్రాంత ప్రజలకు వ్యాపార,వాణిజ్య,వైద్య, విద్య తదితర అవసరాలకు కేంద్రంగా నిత్యం ప్రజల, వాహనాల రద్దీతో ఉండే పట్టణంలో రోడ్లు మొత్తం అస్తవ్యస్తమై ప్రజలు నిత్యం ప్రయాణాలలో కుస్తీ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నకిరేకల్ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు అంతా గజ ఈతగాళ్ళే కానీ,ఒక్కరు కూడా గజం జరగరు అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు.మున్సిపాలిటీ ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఎక్కడ ఏసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని,పట్టణంలోని కడపర్తి,తిప్పర్తి,తాటికల్,మూసి రోడ్లన్నీ ఘోరాతి ఘోరంగా మారాడంతో పాటు వర్షాకాలంలో స్కూల్ పిల్లలు బురదలో స్కిడ్ అయ్యి కిందపడి గాయాలైన సందర్భాలు చాలా ఉన్నాయని గుర్తు చేశారు.

కేసిఆర్ ఏలుబడిలో కాంట్రాక్టర్లు చేసిన పనులకు 20 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించక టెండర్లలో ఎవరూ పాల్గొనడం లేదన్నారు.బంగారు తెలంగాణ అయిందని టీఆర్ఎస్ నేతలు భ్రమ పడడం తప్ప,తెలంగాణ బతుకు చిత్రం మారలేదన్నారు.

Advertisement

ఈ కార్యక్రమంలో దుర్గం జలంధర్,దుర్గం సైదులు,మామిడి నాగయ్య,చింత శ్రీనివాస్,మధు,శ్రీనివాస్,వెంకట్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

కాబోయే కొత్తజంటలకు లగ్గాల బ్రేక్...మూడు నెలలు ముహూర్తాలు లేనట్లే...!
Advertisement

Latest Nalgonda News