బెల్ట్ షాపు మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడు...!

నల్లగొండ జిల్లా: మద్యం మత్తులో ఓ యువకుడు బెల్ట్ షాపు యజమానురాలు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.శనివారం అయన అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ హరిబాబు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

 A Young Man Misbehaves With A Woman In A Belt Shop, Young Man Misbehaves, Woman-TeluguStop.com

అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెం గ్రామంలో పానుగోతు పద్మ కిరాణా షాప్ మరియు బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారు.శుక్రవారం మధ్యాహ్నం చందంపేట మండలం ఉసుమానకుంట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పానుగోతు వాల్య మరికొందరితో కలిసి పానుగోతు పద్మ కిరాణం షాప్ దగ్గరికి వెళ్లి బీర్లు కావాలని అడిగారు.

బీర్లు అధిక ధరకు అమ్ముతున్నావని నిందితుడు పద్మపై అసభ్యకరంగా ప్రవర్తించి ఆమెపై ఘర్షణకు దిగాడు.ఈ సమయంలో ఆమె వస్త్రాలను చింపి వేయడంతో వెంటనే అటుగా వెళుతున్న గ్రామస్తులు నిందితులను అడ్డుకున్నారు.

దీంతో నిందితులు వారిని అడ్డుకున్న వెంకట్ రెడ్డిని కొట్టి పారిపోయారు.వెంటనే గ్రామస్తులు నిందితుడిని పోలీసులకు అప్పగించేందుకు వెంబడించగా నిందితుడు పారిపోతూ కిందపడి గాయపడ్డాడు.పద్మ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube