నల్లగొండ జిల్లా: మద్యం మత్తులో ఓ యువకుడు బెల్ట్ షాపు యజమానురాలు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
శనివారం అయన అడవిదేవులపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ హరిబాబు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
అడవిదేవులపల్లి మండలం ఉల్సాయిపాలెం గ్రామంలో పానుగోతు పద్మ కిరాణా షాప్ మరియు బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం చందంపేట మండలం ఉసుమానకుంట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పానుగోతు వాల్య మరికొందరితో కలిసి పానుగోతు పద్మ కిరాణం షాప్ దగ్గరికి వెళ్లి బీర్లు కావాలని అడిగారు.