నల్లగొండ జిల్లా:బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో నార్కట్ పల్లి బస్ డిపో ముందు ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిలుగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొడ్డు కిరణ్,నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి హాజరయ్యారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్థానంలోని నిజాం రైల్వే,రోడ్డు రవాణా సంస్థలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో 1932 సంవత్సరంలో రెండవ బస్ డిపోగా నార్కట్ పల్లి డిపోను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాలలోని ప్రయాణికులకు విస్తృతమైన సేవాలందించి,ఎందరో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలోనూ, ఎంతోమందికి ఉపాధి కల్పించడంలోనూ నార్కట్ పల్లి డిపో అగ్రభాగంలో నిలిచిందని పేర్కొన్నారు.
అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న నార్కెట్ పల్లి బస్ డిపోను నేడు కనుమరుగు చేసే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు.నార్కెట్ పల్లి డిపో నుండి ఇప్పటికే మేనేజర్ తో సహా 300 మంది సిబ్బందిని,55 బస్సులను ఇతర డిపోలకు తరలించారని,ఇది సరైన విధానం కాదని అన్నారు.
ఇక్కడి నుండి తరలించిన సిబ్బందిని,బస్సులను వెంటనే నార్కట్ పల్లి డిపోకు అలాట్ చేయాలని డిమాండ్ చేశారు.లేనియెడల బీఎస్పీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిపో అధికారులు అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల కాన్షిరాం,నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్,నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఎర్రసాని జంగయ్య,మండల కన్వీనర్ చింత లక్ష్మణ్,సీనియర్ నాయకులు వర్కల గాలిబ్,గ్యార మరయ్య,చిరుమర్తి సైదులు, చెరుకుపల్లి శాంతి కుమార్,గాదె శ్రీకాంత్,చింతపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.