మిర్యాలగూడలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు

నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్ కాలనీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిమల కొండల్ రావు( Animala Kondal Rao ) నేతృత్వంలో డీఎంవో రవి శంకర్,డిప్యూటీ డిఎంహెచ్ఓ కేస రవితో కలిసి పలు మల్టీ స్పెషాలిటీ,జనరల్,గైనిక్ సహా ఇతర ప్రైవేట్ ల్యాబ్స్,ఫిజియోథెరపీ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.రూల్స్ కు విరుద్ధంగా నడుస్తున్న మూడు ఆస్పత్రులతో పాటు రెండు ఎక్స్ రే ల్యాబ్స్,ఓ ఫిజియో థెరపీ సెంటర్ ను సీజ్ చేసినట్లు వైద్య శాఖ ఆఫీసర్లు తెలిపారు.

 Unannounced Inspections By Medical And Health Department Officials In Miryalagud-TeluguStop.com

మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల్లో పర్మనెంట్ డాక్టర్,కంప్లీట్ స్టాఫ్ లేకుండానే రన్ చేస్తున్నట్లు గుర్తించి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.నవీన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ల్యాబ్,ఐసీయూ( Lab, ICU ) విభాగం విభాగాలను సీజ్ చేసినట్లు చెప్పారు.

కిన్నెర,అనిత, సేఫ్ హాస్పిటల్స్,ల్యాబ్స్, ఎక్స్ రే విభాగం నడుపుటకు సరైన గుర్తింపు లేని కారణంగా వాటన్నిటిని సీజ్ చేసినట్లు చెప్పారు.స్వయంగా డీఎంహెచ్ఓ కొండల్ రావు స్వయంగా తనిఖీలు చేపట్టిన వేళ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, దామరచర్ల పీహెచ్ సీ లో విధులు నిర్వర్తించకుండా సర్కార్ డాక్టర్లు అలుగుబెల్లి జగన్ రెడ్డి, అడావత్ నాగేశ్వర రావు తమ ప్రైవేట్ ఆస్పత్రుల్లో విధులు నిర్వహించడంపై సదరు డీఎంహెచ్ వో వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.

మరోసారి ప్రభుత్వ ఆసుపత్రుల డ్యూటీ టైంలో ప్రైవేట్ ఆస్పత్రులకు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తనిఖీల్లో హెచ్ఈవోలు ప్రభాకర్, వాసు దేవరెడ్డి పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube