అధికారిక లెక్కలే తెలంగాణలో జరిగిన అభివృద్ధికి నిదర్శనమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.ఉమ్మడి నల్గొండ జిల్లా విద్యారంగంలో అనేక విజయాలు సాధించిందని తెలిపారు.
ఈ క్రమంలో అభివృద్ధి జరిగినట్లు నిరూపిస్తే కాంగ్రెస్ నేతలు ముక్కులు నేలకు రాస్తారా అని ఛాలెంజ్ చేశారు.ఒకవేళ అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే క్షమాపణ చెప్తామని మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.