నల్లగొండ జిల్లా:ప్రభుత్వ విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకుండా దశాబ్ది ఉత్సవాలు ఏమిటని ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఆకారపు నరేష్( Naresh ) అన్నారు.మంగళవారం దేవరకొండ పట్టణంలో జరిగిన ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమైనప్పటికీ విద్యార్థులకు ఇంతవరకు పాఠ్యపుస్తకాలు అందని పరిస్థితి ఉందని,ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుల లేక సమస్యలతో స్వాగతం పలుకుతుంటే, పాఠశాలలలో విద్యార్థులే తరగతి గదులను పరిశుభ్రం చేసుకునే దుస్థితి ఏర్పడ్డదన్నారు.
ఇలాంటి తరుణంలో దశాబ్ది ఉత్సవాల( Telangana decade celebrations ) పేరుతో విద్యా ఉత్సవాలు జరపటం సిగ్గుచేటన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ,ఎంఈఓ, డీఈవో పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయని,వీటిని తక్షణమే భర్తీ చేయాలని అనేకసార్లు ప్రభుత్వాన్ని కోరామని,తక్షణమే ఆ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
మరోపక్క ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో బుక్స్,యూనిఫామ్స్,టై, బెల్ట్ తమ ఇష్టారాజ్యంగా వ్యాపార సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని,దీనిపై ప్రభుత్వం జీవో నెంబర్ 1 ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ( Private corporate schools )ఫీజులు నియంత్రణ చట్టం అమలు చేయాలని, లేనియెడల ప్రత్యక్ష ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు బుడిగ వెంకటేష్,రమావత్ లక్ష్మణ్ నాయక్,కొర్ర రాహుల్, దేవపావత్ చందు, మహమ్మద్ షౌభాన్,పెరిక చింటు,కేతావత్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.