ఆ ఊరిలో ఆడవాళ్లు నైటీలు వేసుకుంటే 2000 ఫైన్...చూసి చెప్పినోడికి 1000 ప్రైజ్.! అలా చేయడానికి కారణం ఇదే.!  

nidamarru village nighty is sensation now in andhra pradesh -

కాలేజ్ అమ్మాయిలు జీన్స్ ఫ్యాంట్‌లు, పొట్టి స్కర్టులు వేసుకోకూడదనే నిబంధన గురించి విన్నాం.కానీ, మహిళలు సౌలభ్యం కోసం వేసుకునే నైటీలపై కూడా నిషేదం విధించేవాళ్లు ఉన్నారా? అని డౌట్ వస్తే…నిజమే అని చెప్పాలి.ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో గల నిడమర్రు మండలం తోకలపల్లి గ్రామంలో ఈ రూల్ అమలులో ఉంది.

TeluguStop.com - Nidamarru Village Nighty Is Sensation Now In Andhra Pradesh

నైటీలు ధరించి రోడ్లపైకి వస్తే.రెండు వేలు జరి మానా, చూసినవారు చెబితే రూ.వెయ్యి బహుమతి అని ప్రకటించారు.దీన్ని అతిక్రమిస్తే గ్రామం నుంచి వెలివేయడం జరుగుతుందని గ్రామ పెద్దల కమిటీ నిర్ణయించింది.ఈ నిబంధనల్లో కొన్ని సడలింపులు కూడా చేశారు.మహిళలు రాత్రి వేళల్లో ఇళ్లల్లో ఉన్నప్పుడు నైటీలు వేసుకుంటే తమకు అభ్యంతరం లేదని తెలిపారు.కానీ, పగటి వేళల్లో నైటీలు ధరించకూడదని, ముఖ్యంగా నైటీలు ధరించి గ్రామంలో తిరిగినట్లయితే రూ.2000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు.ఈ జరిమానా సొమ్మును గ్రామంలో అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని తెలిపారు.

అంతేకాదండోయ్.ఎవరైనా పగటి పూట నైటీలు వేసుకున్నట్లు సమాచారం ఇచ్చినట్లయితే.వారికి రూ.1000 నజరానా కూడా ఇస్తామని ప్రకటించారు.దీనిపై ప్రత్యేకంగా దండోరా కూడా వేశారు.

అసలు ఇలా చేయడానికి కారణం ఏంటి అంటే…కట్టుబాట్లకు నెలవుగా ఉండే తోకల పల్లిలో మహిళలు, యువతులు.

గ్రామంలో జరిగే సభలు, సమావేశాలకు నైటీలతో రావడం ఎక్కువగా పెరిగింది.వీటిపై తోటి మహిళలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటంతో చిన్నపాటి గొడవలు జరిగేవి.20-35 ఏళ్ల మహిళలు నైటీలతోనే తమ పిల్లలను స్కూల్లో దింపటం, పాఠశాల బస్సులు ఎక్కించటం, కిరాణా దుకాణాలకు వెళ్లడం, ఎస్‌ఎంసీ, పాఠశాల యాజ మాన్య కమిటీ సమావేశాలు, డ్వాక్రా సమావేశాల్లో పాల్గొనటంతో పెద్దల్లో ఊరి ఆచారాలు, కట్టుబాట్లపై ఆందోళన నెలకొంది.

పగటిపూట నైటీలతో సంచ రించడం వల్ల కుటుంబాల్లో సమస్యలు తలెత్తుతు న్నాయి.నైటీలతో బయటకు వెళ్లద్దని భర్త భార్యను వారిస్తుంటే.ఊరంతా వేసుకుంటే లేనిది నేను వేసుకుంటే తప్పేమిటంటూ వాదించటంతో గొడవలు జరుగుతున్నాయి.

యువకులతోను కొన్నిరకాల సమ స్యలు తలెత్తాయి.ఈ నేపథ్యంలో ఏడు నెలల క్రితం మహిళలంతా గ్రామ పెద్దలతో కలిసి దీనిపై చర్చించి, ఒక నిర్ణయం తీసుకున్నారు.

గ్రామంలో ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడు గంటల వరకూ నైటీలతో సంచరించరాదని నిషేధం విధించారు.మైకుల్లో ప్రచారం చేశారు.

అతిక్రమిస్తే జరిమానాకు సిద్ధమవ్వాలని హెచ్చరించారు.అయితే కట్టుబాట్ల పేరుతో మహిళల స్వేచ్ఛను హరించటం ఏమిటని మరో వర్గం వాదిస్తోంది

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు