రోడ్డు మీద కాళ్లు లేక చక్రాల బండిపై అడుక్కునే వారికి కూడా దానం వేసేందుకు కొందరు ఆసక్తి చూపించరు.గుడి ముందు ఎంతో మంది భిక్షాటన చేస్తారు.
వారికి ఎవరో కొందరు మాత్రమే దాన దర్మాలు చేస్తారు.కాని ఎక్కువ శాతం మంది మాత్రం బిక్షం వేసేందుకు ఆసక్తి చూపించరు.
ఎందుకంటే కాళ్లు, చేతులు బాగానే ఉంటే పని చేసుకోవచ్చు కదా అనేది ఎక్కువ మంది అడిగే ప్రశ్న.కాని అమెరికాకు చెందిన ఒక వ్యక్తిని అవేవి అడగకుండానే వందల కొద్ది డాలర్లు కొందరు ఇచ్చేస్తున్నారు.
ఆ డాలర్లతో అతడు జల్సాలు చేసుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.
న్యూయార్క్‌కు చెందిన జోవాన్ హిల్ చాలా జాబ్‌లు చేశాడు.ఏ జాబ్ కూడా అతడికి నచ్చలేదు.అతడు జాబ్ చేసేందుకు ఆసక్తి చూపించక పోవడంతో ఆర్థికంగా ఇబ్బంది మొదలైంది.
అలాంటి సమయంలో సోషల్ మీడియాలో తన బ్యాంక్ అకౌంట్ ఇచ్చి తనకు బిక్షం వేయాల్సిందిగా కోరాడు.అతడి పోస్ట్ చూసి కొందరు అవాక్కయ్యారు.ఇలా కూడా భిక్షాటన చేస్తారా అనుకున్నారు.అతడికి ఎవరు బిక్షం వేయరు అనుకున్నారు.
కాని కొందరు అతడు కోరిన గంటల వ్యవధిలోనే వందల కొద్ది డాలర్లు పొందాడు.ఆన్‌లైన్‌లో ఇతడు చేస్తున్న బిక్షాటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఈయన్ను దాదాపు లక్షన్నర మంది ఫాలో అవుతున్నారు.వారిలో ఎంతో మంది ఇతగాడికి నెలకు ఇంత అంటూ బిక్షం వేస్తూ ఉంటారు.తనకు బిక్షం వేసిన వారికి రుణం తీర్చుకునేందుకు సరదా వీడియోలు పోస్ట్ చేయడం లేదంటే ఏదైనా కామెడీ స్కిట్‌లు చేస్తూ నవ్వించడం చేస్తూ ఉంటాడు.అలా ఇతడు తనకు బిక్షం వేసిన వారి రుణం తీర్చుకుంటూ ఉంటాడు.
ఎన్నో రకాల జాబ్‌లు ఉన్నా కూడా ఇతడు ఈ పనిని ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని అతడిని ఫాలో అవుతున్న వారు అంటున్నారు.తాజాగా జోవాన్ హిల్ స్వలింగ సంపర్కుడు అనే విషయం కూడా చెప్పుకొచ్చాడు.ఆ విషయం తెలిసిన తర్వాత మరింతగా అతడిపై జాలి పడుతూ డాలర్ల వర్షం కురిపిస్తున్నారు.మొత్తానికి అతడు దాదాపుగా లక్ష రూపాయలను సంపాదిస్తున్నాడు.ఆన్ లైన్ ద్వారా అతడి అమౌంట్ ను తీసుకుంటూ ఉన్నాడు.ఆన్‌లైన్ బిచ్చగాడిగా ఇతడు ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు.