సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేసిన జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం కట్టే డ్యాములు నాగార్జున సాగర్ లా ధృడంగా ఉంటాయని, బీఆర్ఎస్ వాళ్లు కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంలా ఉంటాయని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు.శుక్రవారం సాయంత్రం రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి,మాజీ సిఎల్పీ నేత కె.

 District Ministers Uttam And Komati Reddy Released Water To The Left Canal Of Sa-TeluguStop.com

జానారెడ్డి,ఎంపీ రఘువీరారెడ్డి,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యేలు బాలునాయక్‌, బత్తుల లక్ష్మారెడ్డి,ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ,జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి,ఎన్ఎస్పీ అధికారులతో కలిసి నాగార్జున సాగర్ డ్యాం లెఫ్ట్ కెనాల్ హెడ్ రెగ్యూలేటర్ నుంచి సాగునీరు విడుదల చేశారు.పరుగులు తీస్తున్న కృష్ణా జలాలకు పసుపు కుంకుమతో సారె సమర్పించి,జలహారతి ఇచ్చిన అనంతరం లో లెవల్ కెనాల్ దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు కీలకమైన,గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన ఎస్‌ఎల్బీసీ సొరంగం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖలో చేసిన అవినీతి కారణంగా లక్షల కోట్లు ఖర్చు చేసినా కొత్తగా ఆయకట్టు సాగులోకి రాలేదని విమర్శించారు.మేం ఇరిగేషన్ విషయంలో అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుగా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

ప్రతీ ఏటా ఆరున్నర లక్షల ఎకరాలను,ఐదేళ్లలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.మేడిగడ్డ నిర్మాణం అవకతవకలపై లిఖిత పూర్వకంగా ఎన్డీఏస్‌ఏ నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

బీఆర్ఎస్ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు.ఇరిగేషన్ బడ్జెట్ 22వేల 500 కోట్లలో అన్ గోయింగ్ వర్క్స్, ఎస్టాబ్లిష్మెంట్ వర్క్స్ కోసం ఖర్చులు పోగా,మిగిలిన నిధులతో పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత వారిగా పూర్తి చేస్తామన్నారు.

సాగర్ డ్యామ్ మెయింటేనెన్స్ తెలంగాణ ప్రభుత్వమే చేస్తుందన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులైన ఎస్‌ఎల్బీసీ,డిండీ,బ్రహ్మణ వెల్లెంల,పిలాయిపల్లి, లిఫ్టులన్ని అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేస్తామని చెప్పారు.నల్గొండ,మిర్యాలగూడ తదితర అన్ని నియోజకవర్గాలలో కొత్త ప్రాజెక్టులతో పాటు పాత ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు.ఎస్ఎల్బీసి,బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.రాష్ట్ర బడ్జెట్ లో ఇరిగేషన్ కు రూ.22,500 కోట్లు కేటాయించామని, ఇందులో 10,828 కోట్లు ఆగిపోయిన ప్రాజెక్టుల పనులకు,11 వేల కోట్లు ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం కింద తీసుకోవడం జరిగిందనన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని పెండింగ్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నదన్నారు.

నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా 11,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు.

అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఎడమ కాలువ,వరద కాలువలకు నీటి విడుదల చేయడం సంతోషకరమన్నారు.సాగర్ ఎడమకాలువ కింద అన్ని చెరువులు నింపనున్నామని చెప్పారు.

ఎస్‌ఎల్‌బీసీ సహా జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను మూడేళ్లలోపు పూర్తి చేస్తామన్నారు.నేను,ఉత్తమ్ కుమార్ రెడ్డి,పెద్దలు జానారెడ్డి సలహాలతో ముందుకు వెళ్తామని,35 ఏళ్ల కిందట నిర్మించిన ఏఎమ్మార్పీ కెనాల్ కు లైనింగ్ పూర్తి చేస్తామని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని,జిల్లాలో రోడ్లు పనులు పూర్తి చేస్తామని తెలిపారు.

సాగర్ కాలువకు నీటి విడుదల సందర్భంగా రైతులు ఆనందంతో సంబురాలు చేసుకున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతుల ప్రభుత్వం అంటూ రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.

శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న,శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి,బాలు నాయక్,మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సిఈ నాగేశ్వరరావు,ఎస్ఈ, ఈఈలు,ఇతర ఇంజనీరింగ్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube