నేడు రైతుల ఖాతాలో రైతు బంధు జమ...

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో రబీపంటల సాగు ముమ్మరంగా సాగుతున్నందున రైతులకు( Farmers ) అవసరమైన పెట్టుబడి సాయం కోసం రైతుబంధు నిధులు జమ చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు( Tummala Nageswara Rao ) అధికారులను ఆదివారం సాయంత్రం ఆదేశించారు.శనివారమే మంత్రి అధికారులతో రైతుబంధు పధకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

 Rythu Bandhu Deposit In Farmers Account Today...-TeluguStop.com

ఈ సందర్భంగా అధికారులు మంత్రికి రైతుబంధు పధకం వివరాలను వెల్లడించారు.ఇప్పటికే 40శాతం మంది రైతులకు నిధులు అందాయని తెలిపారు.27లక్షల మంది రైతుల ఖాతాలకు నిధులు జమ అయ్యాయని తెలిపారు.మిగిలిన రైతులకు కూడా సోమవారం నిధులు జమ చేయాలని మంత్రి ఆదేశిం చారు.

సోమవారం నుండి అధికసంఖ్యలో రైతులకు రైతుబంధు చేరేలా చూడాలన్నారు.ఈ అంశంపై సంక్రాంతి తర్వాత మరోమారు సమీక్ష నిర్వహిస్తామన్నారు.

రైతులసంక్షేమం, వ్యవసాయం నూతన ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యత అని అన్నారు.గత ప్రభుత్వం నుండి సంక్రమించిన క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితి ఉన్నా కూడా ఈ ప్రభుత్వం రైతుబంధును సకాలంలో అందజేయ డానికి కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube