నల్లగొండ జిల్లా:నేడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.గురువారం ఉదయం 11 గంటలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్‌లో ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు.
మునుగోడు నియోజక వర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీకి,పదవి వకి రాజీనామా చేయడంతో మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చిన సంగతి తెలిసిందే.హోరాహోరిగా సాగిన ఈ ఉప ఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వామపక్షాల మద్దతుతో విజయం సాధించారు.