పార్లమెంట్ ఎన్నికల్లో( Parliament Elections P గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ కార్యకర్త సైనికుల వలె పనిచేయాలని,పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కుందూరు రఘువీర్ రెడ్డి యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.బుధవారం నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని పిఆర్ఆర్ గార్డెన్ లో యువజన కాంగ్రెస్( Yuvajana Congress ) అధ్వర్యంలో యువ సమ్మేళనం నిర్వహించారు.
ముందుగా దర్గా నుండి పిఆర్ఆర్ గార్డెన్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు.అనంతరం జరిగిన యువ సమ్మేళనంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ మాట్లడుతూ దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) దేవరకొండ నుంచి తన సత్తా చూపిస్తామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటిలను అమలు చేసి ఎన్నికలకు పోతామని,ప్రతి పేదవానికి సంక్షేమ పథకం అందడమే మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.పేదవాడు ఏ ఆపదతో వచ్చినా తము అన్నివేళలా అండగా ఉండి సహకరిస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొర్ర రామ్ సింగ్,జిల్లా అధ్యక్షుడు రాజారమేష్ యాదవ్,జాల నరసింహారెడ్డి,దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ,కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.