భార్య అక్రమ సంబంధమే భర్త ప్రాణాలు తీసిందా? భర్త మృతికి భార్యే కారణమా? ఇంతకీ హత్యనా?ఆత్మహత్యనా? మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు.ప్రియుడుతో కలసి భార్యే చంపిందని ఆరోపణలు.
గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు.పోలీసులు అప్పుడే యాక్షన్ తీసుకుంటే రియాక్షన్ వేరేలా ఉండేది.
తన కొడుకు బ్రతికేవాడని తల్లి కన్నీటి పర్యంతం.
నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణంలో ఆదివారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం నకిరేకల్ పట్టణానికి చెందిన వరికుప్పల మహేందర్(32)కు మర్రిగూడెం మండలం అంతంపేట గ్రామానికి చెందిన మహేశ్వరితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.వీరికి ఇద్దరు కుమార్తెలు.
కొంత కాలం వరకు సాఫీగా సాగిన వీరి సంసార జీవితంలో అక్రమ సంబంధం చిచ్చు పెట్టింది.అప్పటి నుండి ఇద్దరూ కలిసే ఉంటున్నా మనస్పర్థలతోటే కాపురం సాగుతుంది.
ఈ నేపథ్యంలో మహేశ్వరి అక్రమ సంబంధం గురించి రెండుసార్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.అయినా ఆమె తీరు మారలేదు.
ఈ క్రమంలో సోమవారం మహేందర్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో,భార్య అక్రమ సంబంధం జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడా? లేక తనకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కుటుంబసభ్యులు, బంధువులు మాత్రం తన అక్రమసంబంధం బయటపడుతుందనే భయంతోనే భార్య ప్రియుడితో కలిసి హత్య చేసిందని ఆరోపిస్తున్నారు.
భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిందెవరు?
నకిరేకల్ పట్టణానికి చెందిన మహేందర్,మహేశ్వరీ కాపురంలో అక్రమ సంబంధం చిచ్చు పెట్టింది.వారు నివాసం ఉంటున్న కాలనీకే చెందిన ఊట్కూరి భాస్కర్ తో మహేశ్వరి గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
మృతుడి తల్లి సావిత్రమ్మ మాటల్లో
ఊట్కూరి భాస్కర్ అనే వ్యక్తి తన కోడలు మహేశ్వరితో అక్రమ సంబంధం పెట్టుకొని,తీసుకెళ్లి సహజీవనం చేస్తుంటే తన కొడుకు మహేందర్ తేదీ:05-08-2021 న భాస్కర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.తన భార్య అయిన మహేశ్వరిని భాస్కర్ తీసుకెళ్ళి సహజీవనం చేస్తున్నాడని కిడ్నాప్ కేసు పెట్టాడు.పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో జిల్లా ఎస్పీ,డీఎస్పిల దృష్టికి తీసుకెళ్లాడు.అయినా పోలీసుల నుండి ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఇక తమకు అడ్డులేదని భాస్కర్-మహేశ్వరి బరితెగించారు.మహేందర్ బ్రతికుంటే ఎప్పటికైనా తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తాడని భావించిన భాస్కర్-మహేశ్వరీ మహేందర్ ను ఎలాగైనా మట్టుపెట్టాలని పలుమార్లు దాడి చేశారు.
అంతేకాకుండా భాస్కర్ అన్నదమ్ములు తన కొడుకు మహేందర్ పై దాడి చేసి చంపుతామని బెదిరించారని నాతో చెప్పాడు.భాస్కర్ తన అన్నదమ్ములు కలసి తన కొడుకుపై దాడి చేయడంతోనే దెబ్బలు తాళలేక మృతి చెందాడు.
తన కొడుకు ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు భాస్కర్ పై గట్టి చర్యలు తీసుకుంటే తన కొడుకు నేడు శవమయ్యేవాడు కాదని మృతుని తల్లి సావిత్రమ్మ కన్నీరుమున్నీరుగా విలపించింది.ఇప్పటికైనా తన కొడుకు మృతిపై సమగ్ర విచారణ జరిపి కనీసం శవానికైనా న్యాయం చేయాలని పోలీసులను వేడుకోవడం అందర్నీ కలచివేసింది.