నల్లగొండ జిల్లా:చండూరు మున్సిపాలిటీకి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు అన్నపర్తి శేఖర్ శుక్రవారం తెల్లవారుజాము నుండి కనిపించకుండా పోవడం కలకలం రేపుతుంది.ముందుగా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా భావించినా పోలీసులు దీనిని ఖండించడంతో ఉత్కంఠ మరింత పెరిగింది.
ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలతో వివాదాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ వివాదాల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు
కిడ్నాప్
చేశారా…?లేదా అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు అదుపులోకి తీసుకున్నారా…?అనే చర్చ మండలంలో చర్చ జోరుగా సాగుతుంది.అధికార కాంగ్రెస్ పార్టీపై సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు గత రెండు నెలల క్రితంమే స్పెషల్ పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చినట్టు,ప్రస్తుతం చండూరు పోలీసులు తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్పినట్లు సమాచారం.అధికార పార్టీ నేతలే కిడ్నాప్ చేయించారంటూ బీఆర్ఎస్ నేత కుటుంబ సభ్యులు ఆరోపించడం గమనార్హం.