యాదాద్రి జిల్లా:ప్రకృతి సంపద అయిన ఇసుకను మూసి పరివాహక ప్రాంతం అయినటువంటి రామన్నపేట మండలం సూరారం గ్రామంలో కొందరు ఇసుక మాఫియాగా ఏర్పడి వాగు నుండి ఇసుకను దొరికిన కాడికి తోడి వేస్తూ డంపు చేసి అక్కడినుండి హైదరాబాద్ తదితర ప్రాంతాలకు లారీల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.ఈ గ్రామము మండల కేంద్రానికి సుమారుగా 22 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ గ్రామంపై పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ,సరైన నిఘా నేత్రం ఏర్పాటు చేయకపోవడంతో మాఫియా ఆగడాలు పెట్రేగి పోతున్నాయి.ఈ ఇసుక మాఫియా వాగు నుండి ఇసుక తీసుకువస్తూ ట్రాక్టర్లు పల్టీ కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
మద్యం మత్తులో రాత్రి వేళలో ఇసుక మాఫియా ట్రాక్టర్లు ఓవర్ స్పీడ్ తో నడుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.ఈ విషయం మీడియా దృష్టికి రాగా ఆ గ్రామాన్ని మీడియా బృందం సందర్శించగా గ్రామం ఇరువైపుల వందలాది ఇసుక డంపింగ్ దర్శనమిచ్చాయి.
ఈ విషయంపై తక్షణమే పోలీస్ అధికారులు,రెవెన్యూ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకొని ఇసుక ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.