హైవే పనుల్లో వేగం పెంచాలి:కలెక్టర్

నల్లగొండ జిల్లా: నల్గొండ పట్టణంలో చేపట్టిన నేషనల్ హైవే రహదారి అభివృద్ధి,విస్తరణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.సోమవారం కలెక్టర్ పట్టణంలో నేషనల్ హైవే రహదారి అభివృద్ధి,విస్తరణ పనులు దేవరకొండ రోడ్డులో మున్సిపల్,నేషనల్ హైవే అధికారులతో కలిసి తనిఖీ చేశారు.

 Speed Up Highway Works: Collector-TeluguStop.com

రోడ్డుపై విద్యుత్ స్తంభాలు తొలగింపు పనులు త్వరగా పూర్తి చేయాలని,వాటి స్థానంలో ఎలక్ట్రికల్ టవర్ లు ఏర్పాటు చేయాలని సంబంధిత కాంట్రాక్టర్,అధికారులను ఆదేశించారు.టైమ్ షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయాలని, జాప్యం చేయవద్దని సూచించారు.

జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ డా.కె.వి.రమణాచారి, ఎస్.పి.డి.సి.ఎల్ డిఈ విద్యాసాగర్ లు ఉన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ స్వయంగా పట్టణంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కేశరాజుపల్లి,మర్రిగూడ బైపాస్ నుండి క్లాక్ టవర్ వరకు రహదారి అభివృద్ధి,సుందరీకరణ పనులను పరిశీలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube