నల్లగొండ జిల్లా:నిడమనూరు మండలంలో ఆదివారం రాత్రి 10 గంటలకు,తెల్లవారు జామున 3 గంటలకు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు,మరో వ్యక్తి మరణించిన ఘటన నల్లగొండ జిల్లాలో విషాదం నింపాయి.వివరాల్లోకి వెళితే…ఆదివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో బైక్ పై వెళ్తున్న రమావత్ కేశవులు (19) వేంపాడు స్టేజీ వద్ద రోడ్డు దాటుతున్న బల్గూరి సైదులు(55) బైక్ తో ఢీకొట్టాడు.
ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు.ఈ మరణవార్త విన్న రమావత్ కేశవులు కుటుంబ సభ్యులు పెద్దవూర మండలం పూల్యా తండా నుండి ఏడుగురు టాటా ఏసీ వాహనంలో తెల్లవారు జామున మూడున్నర గంటల ప్రాంతంలో మిర్యాలగూడకు వెళ్తుండగా వేంపాడు పార్వతీపురం స్టేజి మధ్యన వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ట్యాంకర్ ఢీ కొట్టడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు రమాత్ పాండ్యా(40) రమావత్ గన్యా(40) రమావత్ బుజ్జి (38) నాగరాజు (28) అక్కడికక్కడే మృతి చెందారు.
తీవ్రగాయాల పాలైన మరో ఇద్దరిని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు.నిడమనూరు ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.