జర్నలిస్ట్ శంకర్ పై మునుగోడు పీఎస్ లో ఫిర్యాదు

నల్లగొండ జిల్లా:బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డిలపై గురువారం జర్నలిస్ట్ శంకర్ తన యూట్యూబ్ ఛానల్లో రూ.100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం మునుగోడు పోలీసు స్టేషన్లో స్థానిక బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు.అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటూ, జర్నలిస్టునని చెప్పుకొనే శంకర్ గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్,ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డిలపై చేసిన ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు.జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు,ఉపాధ్యక్షుడి రాజకీయ,వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఆరోపణలు చేయడమే కాకుండాశని,ఆది వారాల్లో పక్కా ఆధారాలతో రుజువు చేస్తానని కూడా ఛాలెంజ్ చేయడం జరిగిందని,అందుకే నాలుగు రోజుల వరకు ఎదురుచూసిన తర్వాత నేడు పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.

 Complaint In Front Wall Ps Against Journalist Shankar-TeluguStop.com

గంగిడి మనోహర్ రెడ్డిని ఉద్దేశించి శంకర్ ఛానల్ లో మాట్లాడుతూ మునుగోడులో నువ్వేం చేయలేవని,గత ఎన్నికల్లో అమ్ముడుపోయావని,తీవ్ర పదజాలంతో దూషించాడని, జర్నలిస్ట్ ముసుగులో శంకర్ ఇలాంటి ఆధారాలు లేని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.వెంటనే జర్నలిస్ట్ శంకర్ పై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube