శునకాల పెళ్లి సందడి.. ఈ వీడియో చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!

సాధారణంగా కుక్కలకి పుట్టినరోజులు జరపడం మనం చూసాం.అయితే ఇప్పుడు ఏకంగా కుక్కలకి ఘనంగా పెళ్ళి చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది ఓ మహిళ.

 Viral Video Netizens Delighted By Seeing The Dog Couple Gets Married Details, Do-TeluguStop.com

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.దీన్ని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

ఇదేం విడ్డూరం బాబోయ్ అని కొందరు నోరెళ్లబెడుతున్నారు.ఈ వీడియోని heymynamesluna అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయగా దీనికి ఇప్పటికే లక్షల్లో వ్యూస్, వేలల్లో లైకులు వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో రెండు శునకాలు పెళ్లి డ్రెస్సు ధరించి ఒక మహిళ ముందు కూర్చోవడం చూడవచ్చు.వీటిలో మగ కుక్క నల్లకోటులో భలే అట్రాక్టివ్ గా కనిపించగా.

లూనా అనే ఆడ కుక్క వైట్ కలర్ గౌన్‌, అందమైన ఫ్లవర్స్ ధరించి చాలా క్యూట్ గా కనిపించింది.అనంతరం ఈ లూనా డాగ్ ఒక రూమ్ లో బల్లపై నిల్చొని హీరోయిన్‌లా పోజు ఇచ్చి ఆశ్చర్యపరిచింది.

ఫారిన్ మనుషులు ఎలా పెళ్లి చేసుకుంటారో అలానే ఈ కుక్కలు కూడా పెళ్లి చేసుకున్నాయి.

లూనా డాగ్ ఒక మానవురాలు.ఇది ఒక అత్యంత అందమైన వధువు” అని ఈ వీడియో కి ఒక క్యాప్షన్ జోడించారు.అయితే ఈ కుక్కని మానవులతో పోల్చడం సరికాదని.

ఇవి మానవుల కంటే అత్యంత ప్రేమను పంచగలవు అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు.ఈ వీడియో చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉందని మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.మిగతా వారు మాత్రం దీనిని చాలా ఫన్నీ వీడియో గా భావించి తెగ నవ్వుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube